గుజరాత్‌లోని మోర్బీ తాలూకా టిండి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఆర్థిక వివాదం కారణంగా తన కుమారుడిపై కొందరు వ్యక్తులు దాడి చేస్తుండటాన్ని చూసి అడ్డుకునేందుకు వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఖోడా ములాడియా (70)గా గుర్తించారు. ఆయన కుమారుడు జిగ్నేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం, జిగ్నేష్ తన మేనమామ కుమారుడు అనిల్ బరియా, స్నేహితుడు జీవన్ ధంధుకియాతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో రెండు కార్లలో వచ్చిన కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. అనిల్‌తో ఉన్న ఆర్థిక వివాదాన్ని పరిష్కరించేందుకు జిగ్నేష్ సహకరించాలని వారు కోరారు. అయితే ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని జిగ్నేష్ చెప్పడంతో వాగ్వాదం మొదలైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీంతో ఆగ్రహించిన నిందితులు ఇనుప పైపులు, కర్రలు, పదునైన ఆయుధాలతో జిగ్నేష్‌పై దాడి చేశారు. కుమారుడిపై దాడి జరుగుతోందని తెలుసుకున్న ఖోడా ములాడియా అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దుండగులు ఆయనపైనా దాడి చేసి, ఒక ఎస్యూవీ కిందకు ఈడ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.












