థానే
మహారాష్ట్రలోని జిల్లాలో భారీ వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాను పోలీసులు గుర్తించారు. అక్రమంగా విక్రయించేందుకు తీసుకొచ్చిన 500 మిల్లీగ్రాములకు పైగా నాగుపాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ అక్రమ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.5.2 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారంలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కాశీగావ్ ప్రాంతంలోని దోడియా పెట్రోల్ పంపు సమీపంలో నాగుపాము విషాన్ని విక్రయించేందుకు కొందరు వస్తున్నారనే సమాచారంతో క్రైమ్ డిటెక్షన్ యూనిట్ అధికారులు నిఘా పెట్టారు. పక్కా ప్రణాళికతో వలపన్ని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు గాజు సీసాల్లో సుమారు 250 మిల్లీగ్రాములు, 260 మిల్లీగ్రాముల విషాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక మోటార్‌సైకిల్, మూడు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులను విచారించడంతో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన మరో ఇద్దరు సరఫరాదారులను గుర్తించారు. ముంబైలోని ట్రాంబే, మాన్‌ఖుర్ద్ ప్రాంతాలకు చెందిన వారిని కూడా అరెస్ట్ చేశారు.












