ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాపై యూరప్ దేశాల పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ చర్యల్లో ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేయడంతో పాటు 17 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 100కు పైగా సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు.
జర్మనీ దర్యాప్తు అధికారుల ఆధ్వర్యంలో, యూరోపోల్, యూరోజస్ట్ సహకారంతో ఈ ఆపరేషన్ జరిగింది. ఇజ్రాయెల్, సైప్రస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ నకిలీ పెట్టుబడి వెబ్సైట్లు, సాంకేతిక వ్యవస్థలను నేర ముఠాలకు అందిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోట్ల రూపాయల పెట్టుబడి మోసం
నిందితులు స్టాక్ మార్కెట్, విదేశీ కరెన్సీ, క్రిప్టోకరెన్సీలలో అధిక లాభాలు వస్తాయని బాధితులను నమ్మబలికేవారు. తొలుత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించి, నకిలీ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ లాభాలు వచ్చినట్లు చూపించేవారు. దీంతో బాధితులు మరింత డబ్బు పెట్టుబడి పెట్టేవారు. చివరకు డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు, వివిధ కారణాలు చెబుతూ తప్పించుకునేవారు.












