మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ మచిలీపట్నం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
రేషన్ బియ్యం అక్రమ కేసులో జయసుధకు ఇప్పటికే మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ మంజూరు సమయంలో కోర్టు విధించిన షరతులను ఆమె ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హైకోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి, జయసుధ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. పోలీసుల వాదనల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొంటూ, వారి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో జయసుధకు ఉపశమనం లభించింది.











