బహుళ స్థాయి మార్కెటింగ్ (MLM) పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యూ నెట్ సంస్థ కార్యాలయాలపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నగరాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.
హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్యూ నెట్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు 20 మంది నిందితులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో సంస్థ నిర్వాహకులు, కీలక భాగస్వాములు ఉన్నట్లు భావిస్తున్నారు. అక్రమంగా వసూలు చేసిన నిధులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న క్యూ నెట్ పై ఇటీవల రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ తరహా సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి









