జిల్లా రాజంపేట పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో దక్షిణ్ టైమ్స్ దినపత్రిక డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ చందు కుమార్తె కుమారి యం. హిమ శైలు పాల్గొన్నారు. 5 కేజీల స్వామివారి లడ్డూను ఆమె రూ. 9,400లకు దక్కించుకున్నారు.
రాజంపేట పట్టణంలోని న్యూ బోయపాలెం వీధిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం గణనాథుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి లడ్డూ వేలం పాటను నిర్వహించారు. చిన్నారుల్లో ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వేలం పాటలో దక్షిణ్ టైమ్స్ దినపత్రిక డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ చందు కుమార్తె అయిన కుమారి యం. హిమ శైలు 5 కేజీల స్వామివారి లడ్డూను రూ. 9,400/- లకు దక్కించుకున్నారు. ఇది ఈ వేలంలో అత్యధిక మొత్తం కావడం విశేషం.












