కామారెడ్డి పట్టణంలోని ఆర్కే గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం మహాలయ అమావాస్య సందర్భంగా బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రకృతిని ఆరాధించే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.
ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను సృజనాత్మకంగా పేర్చారు. కొన్ని బతుకమ్మలను అమ్మవారి రూపంలో, మరికొన్నింటిని చంద్రవంక ఆకృతిలో తీర్చిదిద్ది తమ కళాత్మకతను ప్రదర్శించారు. వేడుకల్లో భాగంగా ఎస్ఆర్కే కళాశాల విద్యార్థినులు ఆర్కే కళాశాలకు విచ్చేసి సంయుక్తంగా బతుకమ్మ ఆడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం అక్కడి నుండి విఆర్కే కళాశాల మీదుగా ఆర్యానగర్ కాలనీ పార్కుకు చేరుకొని, స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఉప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆర్కే గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థినులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












