ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు పుస్తకాల కొనుగోలు భారం మోపడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనుబంధ పాఠశాలలు పుస్తకాల స్థానంలో సొంతంగా సూచించిన పుస్తకాలను కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నాయన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని , రాష్ట్ర పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగి, తల్లిదండ్రి అయిన బొల్లెద్దు జాషువా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని మోతీనగర్ డాన్ బాస్కో స్కూల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర అనుబంధ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, పాఠ్యప్రణాళికలను అమలు చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాఠశాలలు సూచించిన విక్రేతల వద్దే పుస్తకాల సెట్లు కొనాలని ఒత్తిడి చేస్తున్నారని, దీనివల్ల తల్లిదండ్రులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విధానం నిబంధనలు, విద్యాహక్కు చట్టం-2009కు విరుద్ధమని వాదించారు.











