ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ () 202627 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువును పొడిగించింది. అర్హులైన విద్యార్థులకు మరింత అవకాశం కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో నిర్ణయించిన గడువు ముగియడానికి సమయం తక్కువగా ఉండటంతో, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ గడువు పొడిగింపు జరిగింది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ () ద్వారా జమ చేస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పథకానికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఎనిమిదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంపిక పరీక్షలో అర్హత సాధిస్తే, తొమ్మిదో తరగతి నుంచి స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందుతుంది.












