వై.ఎస్.ఆర్ కడప, 13 September
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం కడప నగరంలోని నాగరాజుపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు పాల్గొని ప్రజలకు విగ్రహాలను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సౌత్ జోన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ ఐస్‌క్రీమ్ రవి ఆధ్వర్యంలో కడప నగరంలోని నాగరాజుపేటలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు పాల్గొని ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి అని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శ్రీలేఖ, మహమ్మద్ షఫీ, తుంగ విజయలక్ష్మి, సుబ్బరాయుడు, ఈస్ట్ జోన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి నాయకులు సుధాకర్ రెడ్డి, తరితరులు పాల్గొన్నారు.










