కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఆహార భద్రతా అధికారి జి. విక్రమ్ మంగళవారం పలు చిల్లర దుకాణాలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించి తొలగించారు. అలాగే, నిబంధనలు పాటించని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఆహార భద్రతా అధికారి జి. విక్రమ్ మంగళవారం పలు చిల్లర దుకాణాలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ తనిఖీల్లో కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించి, వాటిని వెంటనే తొలగించి పారవేయించారు. నాణ్యతపై అనుమానం ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.












