ప్రజారోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ () కీలక ముందడుగు వేసింది. భారత్‌కు చెందిన వాధ్వానీ ఏఐ కార్యక్రమంతో దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ కార్యాలయం రెండేళ్ల ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2021 నుంచి 2031 వరకు అమల్లో ఉంటుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయో పరిశీలించనున్నారు. ముఖ్యంగా వ్యాధుల స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు, ఆరోగ్య ప్రమాదాల అంచనా, వ్యాధుల వ్యాప్తి పర్యవేక్షణ వంటి అంశాల్లో ఏఐ వినియోగంపై ఆధారాలను సేకరించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏఐ సాంకేతికతను ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టే ముందు దాని భద్రత, ప్రభావం, ఖర్చు, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను అంచనా వేయడం ఈ ఒప్పందంలోని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అలాగే, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థల్లో ఈ సాంకేతికతను ఎలా సమర్థవంతంగా అనుసంధానించవచ్చో అధ్యయనం చేయనున్నారు.












