అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడంతో పాటు ఆర్థికంగా అండగా నిలిచేలా నూతన పాలసీని రూపొందించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ పాలసీలో భాగంగా విశాఖ, కర్నూలు, తిరుపతిలో రిఫరల్ సెంటర్లు, విజయవాడలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, అరుదైన వ్యాధుల నిర్ధారణ, చికిత్స, పాలసీ రూపకల్పనపై విజయవాడలో జరిగిన సదస్సులో ఈ కీలక ప్రకటన వెలువడింది. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదనే కారణంతో ఎవరూ వైద్యం అందకుండా పోకూడదనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కర్నూలు, తిరుపతి, విశాఖపట్నంలో ఒక్కొక్కటి చొప్పున రిఫరల్ సెంటర్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై పరిశీలన జరుగుతోంది. అదేవిధంగా, విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.











