బద్వేల్ పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శనివారం భారీ చోరీ జరిగింది. బ్యాంకులో రూ. 9.50 లక్షలు డ్రా చేసుకున్న వ్యక్తి నుంచి దుండగులు నగదును అపహరించి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బద్వేల్ పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శనివారం చోరీ ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి నుంచి రూ. 9.50 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివరాల్లోకి వెళితే, పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఓ వ్యక్తి రూ. 9.50 లక్షలు డ్రా చేసుకున్నాడు. నగదు తీసుకుని బయటకు వస్తుండగా, ముందుగానే మాటు వేసిన దొంగలు ఆ నగదును దొంగిలించి పరారైనట్లు తెలుస్తోంది.










