ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం (పీఆర్ఎస్వైఎఫ్) రాష్ట్ర ప్రథమ మహాసభలు కడప నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని, నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని వక్తలు డిమాండ్ చేశారు.
కడప నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ఏపీ టూరిజం హరిత హోటల్ వరకు విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం హరిత హోటల్లో నిర్వహించిన మహాసభకు పీఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నేలూరు శంకర్ అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రముఖుల భాగస్వామ్యం












