బెంగళూరుకు చెందిన ఒక వ్యవస్థీకృత ముఠా కడపలో పులి, చిరుత చర్మాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తోందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, నకిలీ చర్మాలు, గోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు కన్సర్వేటర్ మార్గదర్శకత్వంలో, కడప డీఎఫ్ఓ టి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో బద్వేల్ ఫారెస్ట్ రేంజర్ నయీమ్ నేతృత్వంలోని బృందం కొనుగోలుదారుల వలె మారువేషం ధరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమాచారం అందించిన డ్రైవర్ సహాయంతో బెంగళూరు నుండి మైదుకూరు పరిధి వరకు ఇద్దరు నిందితులను వెంబడించారు.












