రాష్ట్రంలోని 8 షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేందుకు కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ నిర్ణయం దారుణమని, చంద్రబాబు నాయుడు తమ వారికి ఫ్యాక్టరీలను కట్టబెట్టాలని చూస్తున్నారని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని 8 షుగర్ ఫ్యాక్టరీల అమ్మకాల కోసం కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని 8 షుగర్ ఫ్యాక్టరీలను అమ్మడానికి కూటమి ప్రభుత్వం నోటీసు ఇవ్వడం దారుణమన్నారు. కో-ఆపరేటివ్ రంగంలోని షుగర్ ఫ్యాక్టరీలను చంద్రబాబు నాయుడు తమ వారికి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.











