నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. పోలీసుల వేధింపులు తాళలేక, హోటల్ నిర్వాహకుడు పొలాస సుధాకర్ సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లేట్‌నైట్ వరకు హోటల్ నడుపుతున్నారనే కారణంతో పోలీసులు తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
భీంగల్ బస్టాండ్‌లో హోటల్ నిర్వహిస్తున్న పొలాస సుధాకర్ కథనం ప్రకారం, పోలీసులు తనను పలుమార్లు ప్రశ్నించి, జరిమానాలు విధించారని తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ఫైన్ వేసిన పోలీసులు, తాజాగా జరిమానా విధించి, పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి రావాలని ఆదేశించారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తాను చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇతర దుకాణాలు కూడా తెరిచి ఉన్నప్పటికీ వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.












