మండలం నాగిరెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం రూపొందించిన సావనీర్‌ను రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి యల్లటూరు శ్రీనివాసరాజు ఆవిష్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృపానందం ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో, పాఠశాల పూర్వ విద్యార్థి అయిన యల్లటూరు శ్రీనివాసరాజు తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకున్నారు. ఆనాడు ఉపాధ్యాయులు అందించిన విద్యాబోధన, క్రమశిక్షణ తన ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాఠశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సావనీర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని శ్రీనివాసరాజు పేర్కొన్నారు.












