అన్నమయ్య జిల్లా మండలం చెన్నముక్కపల్లి రాజుల కాలనీలో సోమవారం సాయంత్రం ఒక వింత ఘటన చోటు చేసుకుంది. తన భర్త ఇంటి ఎదుటే భార్య బైఠాయించి ఆందోళన చేపట్టడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, తల్లిదండ్రుల ఒత్తిడితో మరో వివాహం చేసుకున్నాడని మహిళ ఆరోపించింది.
సుజాత అనే మహిళ తన భర్త తరిగొండ మల్లేశ్ ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరం చేశాడని, ఇప్పుడు తల్లిదండ్రుల బలవంతంతో మరో పెళ్లి చేశారని ఆమె ఆరోపించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నా భర్త నాకు కావాలి, నాకు న్యాయం చేయండి అంటూ సుజాత పోలీసులను, మీడియాను వేడుకుంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది.











