కడప జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మండలంలోని వెంకయ్య కాలువ గ్రామంలో గ్రామసభ నిర్వహించి, ఎన్నికల ప్రశాంత వాతావరణం, మహిళల భద్రతపై గ్రామస్థులకు సూచనలు అందించారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్.ఐ. సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వెంకయ్య కాలువ గ్రామంలో గ్రామసభను నిర్వహించారు. రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఆపద సమయాల్లో సంప్రదించాల్సిన అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు.











