మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యత సమస్యల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలపై దృష్టి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జ్యోతి సూచించారు. ఆయిల్‌పామ్ సాగు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయక పంట అని ఆమె పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా అంబర్పేట్ గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్‌రావు ఆయిల్‌పామ్ తోటను సందర్శించి, సాగు విధానం, దిగుబడి, ఆదాయం, ప్రభుత్వ రాయితీలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతు ప్రవీణ్‌రావు మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైందని, ఇప్పటివరకు 10 సార్లు గెలల కోత చేపట్టి సుమారు 10 టన్నుల దిగుబడి పొందినట్లు వెల్లడించారు. దీని ద్వారా సుమారు రూ.2.50 లక్షల ఆదాయం లభించిందని తెలిపారు. ఇది రైతులకు మంచి ఆదాయ మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.












