కరువు ప్రభావిత మండలాల్లోని రైతులకు బ్యాంకుల ద్వారా రుణ ఉపశమన చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు పంట రుణాలు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల పునర్వ్యవస్థీకరణ, రీషెడ్యూలింగ్, మారటోరియం వంటి సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు.
తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ (విపత్తు నిర్వహణ-2) శాఖ జారీ చేసిన జీవో నంబర్ 03 ప్రకారం, కరువు ప్రభావిత రైతులకు అందించాల్సిన బ్యాంకింగ్ సంబంధిత ఉపశమన చర్యలపై బుధవారం కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జుక్కల్, పెద్ద కొడప్గల్, సదాశివనగర్, మద్నూర్ (మొహమ్మద్‌నగర్) మండలాలను మధ్యస్థ తీవ్రత కలిగిన కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో, అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం రుణాల పునర్వ్యవస్థీకరణ, రీషెడ్యూలింగ్, మారటోరియం వంటి ఉపశమన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.












