మైదుకూరు, 11 September
వైయస్సార్ కడప జిల్లా మండలంలోని జీవి సత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించింది. దీనితో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జీవి సత్రం హైస్కూల్లో మిడ్ డే మీల్స్‌లో ‘బల్లి’: ముగ్గురు విద్యార్థులకు వాంతులు డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ డాక్షిన్ టైమ్స్ . వైయస్సార్ కడప జిల్లా మండలంలోని జీవి సత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. పాఠశాల విద్యార్థులకు వడ్డించిన పప్పులో బల్లి కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకుల అశ్రద్ధ వల్లే ఈ ఘోరం జరిగిందని పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భోజనం సరిగా పరిశీలించకుండా సరఫరా చేయడం వల్ల, బల్లి పడిన పప్పును తిన్న ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక వైద్య సిబ్బంది స్పందించి హైస్కూల్ వద్దకే చేరుకున్నారు. విద్యార్థులకు పాఠశాల వద్దనే ప్రాథమిక చికిత్స అందించడంతో వారికి ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్మార్ట్ కిచెన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భోజన నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.












