కామారెడ్డి, 27.7.2020
కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ జిల్లాస్థాయి కిడీ, జావలిన్, యూత్ సెలక్షన్స్ ఇందిర గాంధీ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు Dr. M. Jaipal Reddy, రూరల్ CI శ్రీ. శ్రీధర్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నేడు కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ జిల్లాస్థాయి కిడీ, జావలిన్ మరియు యూత్ సెలక్షన్స్ స్థానిక ఇందిర గాంధీ స్టేడియం నందు ఉదయం 5:00 గం॥లకు ప్రారంభించబడినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అసోసియేషన్ అధ్యక్షులు Dr. M. Jaipal Reddy గారు మరియు కామారెడ్డి రూరల్ CI శ్రీ. శ్రీధర్ గౌడ్ గారు విచ్చేసి, పిల్లలను ఉల్సాహపరిచారు. రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని వారు పిల్లలను కోరారు.












