ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాలపై రాజకీయ వివాదం రాజుకుంది. మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియకుండానే జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
జగన్‌పై నారా లోకేశ్ ఫైర్.. టీచర్ల జోలికొస్తే కఠిన చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాలపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీ తేడా తెలియకుండానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని లోకేశ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం మెరిట్, పారదర్శకత ఆధారంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేపట్టిందని తెలిపారు. టీచర్లపై దాడులు లేదా తరగతి గదుల్లోకి చొరబడి ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరించారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని చెబుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










