రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఆటో స్టాండ్ లో శనివారం టిడిపి నాయకులు డాక్టర్ డి. నవీన్ కుమార్ ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చిన డ్రైవర్లకు పరిష్కారానికి హామీ ఇచ్చారు.
కడప జిల్లా ప్రతినిధి, రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆటో స్టాండ్ లో శనివారం సందడి నెలకొంది. ప్రముఖ టిడిపి నాయకులు డాక్టర్ డి. నవీన్ కుమార్ ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తాము రోజూ ఎదుర్కొంటున్న సమస్యలను డాక్టర్ నవీన్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఆటో స్టాండ్ లో ఆటోలను క్రమపద్ధతిలో వరుసలో నిలపడానికి సరైన స్థలం లేకపోవడం, పరిసరాల్లో చెత్త పేరుకుపోయి తీవ్ర అపరిశుభ్రత నెలకొనడం, కొన్ని మ్యాన్ హోల్స్ కు మూతలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.











