గత పదేళ్లుగా సమాజ సేవలో నిమగ్నమైన బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వరప్రసాద్ రావుకు రాష్ట్రస్థాయి పదవి లభించింది. భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థ అయిన జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు.
సమాజంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై స్పందిస్తూ, మానవ హక్కుల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో డా. వరప్రసాద్ రావు గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్నారని తెలిసింది. వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రస్థాయి బాధ్యత లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వరప్రసాద్ రావు స్పందన
ఈ సందర్భంగా డా. వరప్రసాద్ రావు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా, పూర్తి పారదర్శకతతో, అవినీతి రహితంగా సమాజ సేవ చేస్తున్న తనకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బాధ్యతలు అప్పగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.











