కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా రూపొందించిన తప్పుడు సమాచారంతో అమెరికా సైన్యం దాదాపు చైనా నౌకపై చర్యకు సిద్ధమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్ యుద్ధ సమయంలో మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక చైనా నౌక అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన సామగ్రిని తరలిస్తోందని ఒక నిఘా నివేదిక వెలువడింది.
అయితే ఆ సమాచారం తప్పుదోవ పట్టించేదిగా తేలింది. అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కమాండ్‌కు చెందిన ఒక విశ్లేషకుడు నౌకకు సంబంధించిన నిఘా సమాచారాన్ని ఏఐ చాట్‌బాట్ ద్వారా విశ్లేషించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వివిధ సమాచారాన్ని కలిపి విశ్లేషించిన ఏఐ.. నౌకలో ఉన్న సరుకును తప్పుగా గుర్తించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అధికారిక నిఘా నివేదికను రూపొందించి సంబంధిత అధికారులకు పంపించారు. ఈ నివేదిక ఆధారంగా చైనా నౌకను అడ్డుకునేందుకు అమెరికా సైనిక చర్యకు ఏర్పాట్లు జరిగాయి. ఆయుధాలతో కూడిన సిబ్బంది నౌకలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు.











