సదాశివనగర్, 3 September
కామారెడ్డి జిల్లా మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్యను టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండల టిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలుగా ఉప్పల్వాయి సంధ్య కామారెడ్డి జిల్లా మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్ వై సంధ్య టిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఈ మేరకు బుధవారం హైదరాబాదులో ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంచార్జ్ సంపత్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయగౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన ఉప్పల్వాయి సంధ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు తెలంగాణ రక్షణ సేన చీప్ కల్వకుంట్ల కవితక్కకు, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జ్ సంపత్ గౌడ్ కు, మండల అధ్యక్షుడు సాయ గౌడ్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి , పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేస్తానని ఆమె తెలిపారు. గ్రామస్థాయిలో నుండి మహిళ బూత్ కమిటీలను ఎన్నుకొని టిఆర్ఎస్ జండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తానని ఆమె తెలిపారు.











