రాయచోటిలో నూతనంగా నిర్మించబోయే ఆర్టీసీ బస్టాండు నిర్మాణం, అన్నమయ్య, కడప జిల్లాల వ్యాప్తంగా ఆర్టీసీ పరిస్థితులు, బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న రవాణా సౌకర్యాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన సొంత నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కడప ఆర్టీసీ ఈడీ కిషోర్ కుమార్, ఆర్ఎం శశిభూషణ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా రాయచోటిలో నూతనంగా నిర్మించబోయే ఆర్టీసీ బస్టాండు నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు, అన్నమయ్య, కడప జిల్లాల వ్యాప్తంగా ఆర్టీసీ పరిస్థితులు, బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న రవాణా సౌకర్యాలు, వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు తదితర అంశాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.












