జమ్మలమడుగు, జూలై 01
జమ్మలమడుగులో జూలై 03న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, జె.ఎస్.డబ్ల్యూ రాయలసీమ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు బుధవారం సాయంత్రం పరిశీలించారు. హెలిప్యాడ్, స్టీల్ ప్లాంట్ వద్ద జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 03న జమ్మలమడుగులో పర్యటించనున్న నేపథ్యంలో, జె.ఎస్.డబ్ల్యూ రాయలసీమ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కర్నూలు రేంజ్ డిఐజి కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసి డా.నిధి మీనా, నగర కమిషనర్ భావన, సంబంధిత అధికారులు బుధవారం సాయంత్రం పరిశీలించారు. హెలిప్యాడ్, స్టీల్ ప్లాంట్ వద్ద జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు.












