వాహనదారులు తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని వల్లూరు ఎస్సై సూర్యనారాయణ రెడ్డి సూచించారు. కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై ఏ.ఓబయపల్లి బస్ స్టాండ్ వద్ద బుధవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ప్రాణ రక్షణకు హెల్మెట్ అత్యంత కీలకమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించి సరిగా బిగించుకోవాలని సూచించారు. హెల్మెట్ కేవలం పోలీసుల తనిఖీలకు భయపడి ధరించేది కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాహనదారులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పన్ను పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేని వారిపై జరిమానాలు విధిస్తున్నామన్నారు.












