ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు పరిధిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత ప్రతినిధులు సూచించారు. ప్రాజెక్టు నీటిని తాగునీరు, పశువుల అవసరాలకే పరిమితం చేయాలని కోరారు.
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును కలిసి ప్రాజెక్టు నీటి లభ్యత, సాగునీటి పరిస్థితులపై అధికారులు, ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వర్షాభావ పరిస్థితుల కారణంగా తాలిపేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగు చేపడితే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటమే కాకుండా రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు వివరించారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు.












