డిస్ట్రిక్ట్ బ్యూర్ చీఫ్ కడప sep 11, మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ ముందుకు సాగుతోందని పెండ్లిమర్రి ఎస్ఐ తులసి నాగ ప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, మహిళలు తమ రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి మహిళా తమ స్మార్ట్ఫోన్లలో ‘శక్తి యాప్’ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే భయపడకుండా వెంటనే డయల్ 112 ద్వారా పోలీసు సేవలను పొందవచ్చని వివరించారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, గృహహింస, బాల్య వివాహాల నిరోధానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. చిన్నపిల్లలపై లైంగిక దాడుల నివారణకు ఉద్దేశించిన పోక్సో చట్టం, ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ మోసాల పట్ల తీవ్ర అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు.
ఏదైనా సమస్య లేదా వేధింపులు ఎదురైనప్పుడు దాచకుండా, ధైర్యంగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.