జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. దొర్నకంబాల పంచాయతీ పరిధిలో భారీ యంత్రాలతో ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు హద్దు మీరాయి. దొర్నకంబాల పంచాయతీ పరిధిలో భారీ యంత్రాలతో ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికార పార్టీ నేతలు నకిలీ పత్రాలు సృష్టించి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక రైతు నుంచి అనధికారికంగా మట్టిని కొనుగోలు చేసి, ఒక ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుంటూ మట్టి మాఫియా చెలామణి అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హిటాచీలు, జేసీబీలతో రాత్రింబవళ్లు మట్టిని తవ్వి తరలిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.












