పట్టణంలోని లక్ష్మి వెల్ నెస్ వెల్నెస్ స్పా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు మహిళలు, ఒక విటుడు, వెల్నెస్ స్పా సెంటర్ యజమాని, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఎస్డీపీఓ జె.వెంకటనారాయణ పర్యవేక్షణలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చిన్న పెదయ్య తన సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వెల్నెస్ స్పా సెంటర్లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు, ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని షెల్టర్ హోమ్‌కు తరలించారు. వీరితో పాటు ఒక విటుడు, వెల్నెస్ స్పా సెంటర్ యజమాని, మేనేజర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యకలాపాలకు సహకరించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.












