చిత్తూరు, 4 October
తిరుపతి నగరంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.25 లక్షల విలువైన 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తిరుపతి నగరంలో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి వెస్ట్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












