సదాశివనగర్, 9 November
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో జూదం కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఆదివారం రాత్రి మండలంలోని భూంపల్లి, పద్మాజివాడి, మల్లుపేట్ గ్రామ శివారుల్లో నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై మూడు కేసులు నమోదు చేసి, నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలో జూదం కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆదివారం రాత్రి సదాశివనగర్ మండలంలోని వివిధ గ్రామాల శివారుల్లో దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు భూంపల్లి, పద్మాజివాడి, మల్లుపేట్ గ్రామ శివారుల్లో నిర్వహించిన దాడుల్లో జూదం ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.












