జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మత్తు పదార్థాల నిర్మూలన కమిటీ నెలవారీ సమావేశం జరిగింది.
జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, తనిఖీలు, దాడులు, అక్రమ రవాణా నివారణ, ప్రజలు, విద్యార్థులకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలపై సమీక్షించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలు, ఇతర వాహనాల్లో తరలించే వారిపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, ఓవర్లోడింగ్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.












