కడప జిల్లా మండలం చిలంకూరులో భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడికి ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో భర్త కడప రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకోగా, భార్య ఇంట్లోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.
కడప జిల్లా మండలం చిలంకూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మోహన్ రెడ్డి కడప రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకోగా, భార్య భారతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుమారుడికి ఉద్యోగం రాలేదనే ఆందోళనతో మోహన్ రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న భార్య భారతి తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆమె ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.












