జిల్లా: మగపిల్లలు పుట్టారనే సాకుతో భర్త, అత్త వేధింపులు భరించలేక ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదృష్టవశాత్తు విధుల్లో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించి ముగ్గురి ప్రాణాలను కాపాడారు.
జగ్గయ్యపేటకు చెందిన కళ్యాణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు మగపిల్లలే పుట్టారని, ఏం ప్రయోజనమంటూ భర్త రామకృష్ణ, అత్త నిత్యం మాటలతో వేధించేవారని ఆమె వాపోయింది. కొడుతూ, అనుమానిస్తూ చిత్రహింస పెట్టేవారని ఆరోపించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వేధింపులు భరించలేక గతంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. విజయవాడలో చికిత్సతో కోలుకున్నా, ఇంట్లో పరిస్థితి మారలేదని ఆమె తెలిపారు.












