భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ చిరు హోటల్ నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
పోలీసుల వేధింపులు తాళలేక, భీంగల్ బస్టాండ్‌లో హోటల్ నిర్వహిస్తున్న పొలాస సుధాకర్ అనే చిరు వ్యాపారి సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాధితుడి కథనం ప్రకారం, లేట్‌నైట్ వరకు హోటల్ నడుపుతున్నారనే కారణంతో పోలీసులు సుధాకర్‌ను పలుమార్లు ప్రశ్నించి, జరిమానాలు విధించినట్లు ఆరోపించారు.












