దసరా పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటికి తాళం వేసి ప్రయాణాలకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ రామన్ సూచించారు. నిజామాబాద్ జిల్లా ధర్వల్లి మండల కేంద్రంలో ఆయన ఈ మేరకు కీలక భద్రతా మార్గదర్శకాలను విడుదల చేశారు.
దసరా పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటికి తాళం వేసి ప్రయాణాలకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ రామన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ధర్వల్లి ధర్వల్లి మండల కేంద్రంలోని దసరా పండుగ సెలవులలో జంతువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇండ్ల భద్రతపై తీవ్రప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పండుగ సందర్భంగా ప్రజలు పాటించవలసిన కీలక భద్రత మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకునే దొంగల ఆట కట్టించడానికి పౌరులందరూ ఈ కింది నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. మీరు బయటకు వెళ్తున్న విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సోషల్ మీడియాలో ముందుగా పోస్ట్ చేయవద్దని, ప్రయాణం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే ఫోటోలు లేదా వివరాలు షేర్ చేయాలని సూచించారు. ఆభరణాలు, విలువైన వస్తువులను ఇంట్లోనే భద్రపరచుకోవడం ఉత్తమం. పక్కింటి వారికి వాటిని ఇచ్చి వెళ్లడం వంటి పనులు చేయవద్దని చెప్పారు. తాళం వేసి ఊరికి వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో ముందస్తుగా సమాచారం అందించాలని అన్నారు. కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా ఒక ప్రత్యేక గస్తీ దళాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా రక్షణను పెంచుకోవచ్చు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మీ ప్రయాణ వివరాలను ఇరుగు పొరుగు వారికి తెలిపి, ఇంటిని కనిపెట్టి ఉండమని కోరండి. అలాగే వారి ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రయాణానికి ముందు విద్యుత్ సరఫరా, గ్యాస్ సిలిండర్, ఫ్రిజ్ వంటి వాటిని పూర్తిగా ఆఫ్ చేశారో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉండే వృద్ధులు, మహిళలు అపరిచితులు ఎవరైనా వస్తే నమ్మకుండా అప్రమత్తంగా ఉండేలా ముందే చెప్పాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ రామన్ అన్నారు. దొంగతనాల నివారణలో భాగస్వామ్యులు కావాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. అత్యవసర సమయాల్లో ప్రజలు ఎప్పుడైనా డయల్ 112 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిఐ రామన్ తెలిపారు.












