కడప, 8 October
జిల్లాలోని ప్రొద్దుటూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 234 కేజీల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు మాత్రం తప్పించుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. జిల్లా అటవీ శాఖాధికారికి అందిన పక్కా సమాచారం మేరకు, బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.












