అన్నమయ్య జిల్లా మండలం కాపుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త భార్యపై రోకలిబండతో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
కాపుపల్లికి చెందిన దేరేంగుల నరసింహులు తన భార్య నాగరత్న (45)పై మద్యం మత్తులో గొడవపడ్డాడు. ఆవేశంలో ఇంట్లో ఉన్న రోకలిబండ తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో నాగరత్న తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి నాగరత్నను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.












