కడప జిల్లా లక్కిరెడ్డి పల్లె లక్కిరెడ్డి పల్లె మండలం కాపుపల్లెలో భార్య నాగరత్నమ్మ (45) హత్య కేసులో భర్త నరసింహులును పోలీసులు అరెస్టు చేశారు. భార్య కువైట్ వెళ్లేందుకు పాస్‌పోర్టు చేయించుకోవడాన్ని జీర్ణించుకోలేక ఈ ఘాతుకానికి ప్పడినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.
మండలం బియర్గుడి పంచాయతీ పరిధిలోని కాపుపల్లె గ్రామానికి చెందిన నాగరత్నమ్మ, ఆమె భర్త నరసింహులు మధ్య ఈ నెల 7వ తేదీన గొడవ జరిగింది. ఈ క్రమంలో నరసింహులు రోకలిబండతో నాగరత్నమ్మపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగరత్నమ్మను వెంటనే తిరుపతిలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె 8వ తేదీన మృతి చెందింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడు నరసింహులు కోసం పోలీసులు గింపు చర్యలు చేపట్టారు. విస్తృత గింపు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.












