బద్వేల్ పట్టణంలో ప్రేమ వివాహం చేసుకున్న భార్యను భర్త కత్తితో దారుణంగా హత్య చేశాడు. మనస్పర్థల కారణంగా జరిగిన ఈ ఘటనలో భార్య తల, మెడ భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.
కడప జిల్లా బద్వేల్ పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భర్త కత్తితో దాడి చేసి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన సిద్ధవటం రోడ్డులోని సుమిత్ర నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కడప టౌన్ విశ్వనాథపురానికి చెందిన ప్రవళిక (28) పెద్దలకు ఇష్టం లేకుండా సాయిబాబా అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులు భరించలేక ప్రవళిక బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో ఉన్న తన మేనత్త ఇంటికి వచ్చి ఉంటోంది. భార్య తనకు దూరంగా ఉంటోందని ఆగ్రహించిన సాయిబాబా బద్వేల్కు వచ్చి, మేనత్త ఇంట్లో ఉన్న ప్రవళికపై కత్తితో దాడి చేశాడు.












