పోలీసులను (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 10
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే పట్టాల వద్దకు చేరుకుంది. సకాలంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తల్లితో మాట్లాడి, వారిని సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రైల్వే పట్టాలపైకి తల్లీబిడ్డలు.. కాపాడిన పోలీసులు కామారెడ్డి పట్టణంలో కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత తన ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెను వెంట తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే పట్టాల వద్దకు చేరుకుంది. ఈ విషయంపై సాయంత్రం డయల్-112కు సమాచారం అందడంతో కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ బి. నరహరి ఆదేశాల మేరకు బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణం ఆలస్యం చేయకుండా రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్న పోలీసులు తల్లిని, ఇద్దరు చిన్నారులను గుర్తించి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే మార్గాలను వివరిస్తూ ధైర్యం చెప్పడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. అనంతరం తల్లితో పాటు ఇద్దరు చిన్నారులను సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను అధిగమించాలని సూచించారు. సమయస్ఫూర్తితో స్పందించి మూడు ప్రాణాలను కాపాడిన కామారెడ్డి టౌన్ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు. ఆపదలో ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తారని తెలిపారు.












