ప్రముఖ బ్రాండ్‌కు చెందిన అసలైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులంటూ నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అల్తమాష్ (26)గా గుర్తించారు. ఇతను హైదరాబాద్‌లోని మలక్‌పేట సైద్నగర్లో నివాసముంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అల్తమాష్ మరో వ్యక్తితో కలిసి నకిలీ ఎలక్ట్రానిక్ పరికరాలను అసలైన ఆపిల్ ఉత్పత్తులుగా చూపిస్తూ విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వినియోగదారులు అసలైనవిగా భావించి కొనుగోలు చేసేలా మోసపూరితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్వాధీనం చేసుకున్న వస్తువులు
నిందితుడి నుంచి పోలీసులు రెండు ఐఫోన్లు (వాటిలో ఒకటి నకిలీ), నాలుగు నకిలీ ఆపిల్ వాచీలు, ఏడు నకిలీ ఇయర్‌బడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఘజియాబాద్‌కు చెందిన ఆవైస్ ఖాన్ అనే మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.











